Living Together Relationships Increasing ఓవైపు గంజాయి.. మరోవైపు సహజీవనాలు | Oneindia Telugu

2017-11-23 45

Living together relationships are increasing in Shrungavarapu Kota, Vizianagaram. Male Students are earning money by supplying ganja

మాదకద్రవ్యాల ఏరివేతకు ఎన్ని చర్యలు తీసుకున్నా.. గుట్టు చప్పుడు కాకుండా సరఫరా అవుతూనే ఉంది. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల నుంచే గంజాయి సరఫరా అవుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి.
విజయనగరంలోని ఎస్ కోట(శృంగవరపు కోట)లో కాలేజీ అబ్బాయిలు, అమ్మాయిల చేత గంజాయిని సరఫరా చేయిస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. అలా సంపాదించిన డబ్బుతో ఇక్కడ యువత పెడదోవ పడుతున్నట్టు చెబుతున్నారు.విజయనగరం జిల్లాలో ఉన్న ఎస్ కోట ఏజెన్సీ ప్రాంతాలకు ప్రధాన పట్టణంగా ఉంది. అరకు, పాడేరు, అనంతగిరి, డుంబ్రిగూడ, హకుంపేట ప్రజలు ఏ అవసరమైనా ఇక్కడికే వస్తుంటారు. ఇక్కడి నుంచి కాస్త ముందుకెళ్తే అరకు, వెనక్కి వెళ్తే విశాఖ వస్తాయి. విద్యా సంస్థలు కొలువుదీరడం, షాపింగ్ సౌకర్యం ఉండటంతో చాలామంది ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు ఎస్ కోటకే వచ్చి పోతుంటారు.